: 39 రకాల వినూత్నమైన వంటకాలతో అలయ్ బలయ్‌లో ఘుమఘుమలు


హైద‌రాబాద్‌లోని ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌లో కేంద్రమంత్రి బండారు ద‌త్తాత్రేయ నిర్వ‌హిస్తోన్న‌ అల‌య్ బ‌ల‌య్ కార్యక్ర‌మం కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా అక్క‌డ‌ సంప్రదాయ తెలంగాణ వంటకాలు చ‌వులూరిస్తున్నాయి. మెనూలో మొత్తం 39 రకాల వంటకాలు ఉన్నాయి. అల‌య్ బ‌ల‌య్ లో పాల్గొంటున్న వారంద‌రికి వీటిని వ‌డ్డిస్తున్నారు. 800 కిలోల మ‌ట‌న్‌తో, 1400 కిలోల చికెన్‌తో మాంసాహార వంట‌కాలు త‌యారుచేశారు. అందులో 300 కిలోల త‌లకూర‌, 300 కిలోల‌ బోటీతో వంట‌కాలు క‌నిపిస్తున్నాయి. మెనూలో ఉన్న వంట‌కాలు ఇవే... * బగారా అన్నం 1400 కిలోలు * తెల్ల అన్నం 400 కిలోలు * మాంసాహార వంట‌కాల్లో లివర్, మటన్ ఫ్రై, మటన్ పులుసు, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, నాటుకోడి పులుసు, ఫ్రై, రొయ్యలు, వట్టి చేపలు, బొమ్మిడాయిలపులుసు * శాకాహార వంట‌కాల్లో టమాటా కర్రీ, ఆలు ఫ్రై, పప్పు, బెండకాయ పకోడి ఫ్రై. వంకాయ కర్రీ, దొండకాయ ఫ్రై, సాంబారు, రసం, పచ్చిపులుసు * పిండివంటకాల్లో జొన్న రొట్టెలు, సజ్జరొట్టెలు, అంబలి, గారెలు, సకినాలు, మొక్కజొన్నతో చేసిన గారెలు, సర్వపిండి, బచ్చాలు, అటుకులు, లడ్డూలు, మరమరాలు, పుట్నాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News