: జమ్ముకశ్మీర్‌లో మరోసారి చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులు
యూరీలో జరిగిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా పీవోకేలో భారత సైన్యం లక్షిత దాడులు జరిపినప్పటికీ ఉగ్రవాదులు తమ బుద్ధిని మార్చుకోకుండా భారత్‌లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. జమ్ముకశ్మీర్‌లో చొరబడేందుకు ఉగ్రవాదులు ఈరోజు మరోసారి ప్రయత్నించారు. రాష్ట్రంలోని కుప్వారా జిల్లా తంగ్‌ధర్ సెక్టార్ వద్ద ఈరోజు ఉగ్రవాదులు ప్రవేశిస్తుండగా గమనించిన అక్కడి భద్రతా సిబ్బంది వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారు. వారి ప్రవేశాన్ని తిప్పికొడుతూ బలగాలు ఆపరేషన్‌ను ఇంకా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.