: కోలుకుంటున్న సంజన.. కుటుంబ స‌భ్య‌ులను గుర్తుప‌డుతున్న చిన్నారి


హైదరాబాద్‌లోని పెద్ద‌ అంబ‌ర్‌పేట‌లో ఇటీవ‌ల తాగుబోతుల ర్యాష్ కారు డ్రైవింగ్ కు సంజ‌న అనే చిన్నారికి తీవ్ర‌గాయాల‌యిన సంగ‌తి తెలిసిందే. తలకు తీవ్రగాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంజన న‌గ‌రంలోని కామినేని ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోంది. కొన్ని రోజులుగా విషమంగా ఉన్న ఆమె ప‌రిస్థితి ప్రస్తుతం మెరుగుప‌డింద‌ని ఆసుప‌త్రి వైద్యులు తెలిపారు. సంజ‌న‌కు కృతిమ శ్వాస తొల‌గించినట్లు పేర్కొన్నారు. త‌న కుటుంబ స‌భ్యుల‌ను సంజ‌న గుర్తుప‌డుతోందని వైద్యులు చెప్పారు. చిన్నారి పూర్తిగా కోలుకోవ‌డానికి మ‌రి కొన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News