: ఏపీలో టెలికం, పోస్టల్ సర్కిల్స్ ప్రారంభం


నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు టెలికాం, పోస్టల్ సర్కిల్స్ ప్రారంభమయ్యాయి. విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పోస్టల్ సర్కిల్ ను సీఎం చంద్రబాబు నాయుడు, టెలికాం సర్కిల్ ను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు మనోజ్ సిన్హా, సుజనాచౌదరి, రాష్ట్ర మంత్రులు నారాయణ, కామినేని శ్రీనివాస్, ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, దసరా రోజున టెలికాం, పోస్టల్ సర్కిల్స్ ప్రారంభం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. పోస్టల్ వ్యవస్థ పని అయిపోయిందని అనుకున్నారని... కానీ, అది మరింత పుంజుకుందని అన్నారు. బీఎస్ఎన్ఎల్ నిర్మాణం కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. బీఎస్ఎన్ఎల్ తో కలసి ఏపీ ఫైబర్ గ్రిడ్ పనిచేయాలని ఆలోచిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News