: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్ నిర్మాణం ప్రారంభం
ఆకాశాన్నంటే భవనాలతో అలరారుతున్న దుబాయ్ మరో రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమైంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన టవర్ ను నిర్మించడానికి దుబాయ్ లో పనులు మొదలయ్యాయి. ప్రస్తుతానికి ఎత్తైన టవర్ గా పేరుగాంచిన బుర్జ్ ఖలీఫా 828 మీటర్ల ఎత్తు ఉంటుంది. బుర్జ్ ఖలీఫా కూడా దుబాయ్ లోనే ఉంది. ప్రస్తుతం నిర్మిస్తున్న కొత్త టవర్... ఖలీఫా కంటే ఎత్తుగా ఉండబోతోంది. అయితే, ఈ టవర్ ఎత్తు ఎంతన్న విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. స్పానిష్-స్విస్ ఆర్కిటెక్ట్ దీన్ని డిజైన్ చేశారు. దీని నిర్మాణానికి షుమారు 900 మిలియన్ల యూరోలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు.