: కేసీఆర్ అంటే ఏమిటో కొత్త నిర్వచనం చెప్పిన హరీష్


తెలంగాణ ముఖ్యమంత్రి, తన మేనమామ కేసీఆర్ అంటే ఏమిటో కొత్త నిర్వచనం చెప్పారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్ లో K అంటే KNOWLEDGE (ఙ్ఞానం), C అంటే COMMITMENT (నిబద్ధత), R అంటే RECONSTRUCTION (పునర్నిర్మాణం) అని వివరించారు. సిద్ధిపేట జిల్లాను ప్రారంభించిన అనంతరం, బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ, ఉద్విగ్నతకు లోనయ్యారు. జిల్లాను ఏర్పాటు చేసిన కేసీఆర్ కు పాదాభివందనం చేస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన నిర్దేశించిన మార్గంలోనే తాను నడుచుకుంటానని చెప్పారు. సిద్ధిపేట గురించి ముఖ్యమంత్రికి చెప్పడమంటే... హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టే అని అన్నారు.

  • Loading...

More Telugu News