: సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న గ్లెన్ మ్యాక్స్ వెల్ సూపర్ క్యాచ్
ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ సూపర్ క్యాచ్ తో కూడిన వీడియో ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే... మటడోర్ కప్ లో భాగంగా పెర్త్ లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా, విక్టోరియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ అద్భుత రీతిలో బౌండరీ లైన్ వద్ద అందుకున్న క్యాచ్ క్రీడాభిమానులను ఆకట్టుకుంటోంది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఓపెనర్ మైకేల్ క్లింగర్ అద్భుతమైన షాట్ కొట్టాడు. దానిని అంతా సిక్సర్ గా భావించారు. అయితే బౌండరీ లైన్ వద్ద ఆకలిగొన్న పులిలా బంతికోసం ఎదురు చూసిన మ్యాక్స్ వెల్ అమాంతం గాల్లో ఎగిరి బంతిని పట్టుకుని, ఎదురుగా వస్తున్న ఆటగాడికి తిరిగి విసిరాడు. దానిని మరో ఆటగాడు రాబ్ క్వినీ క్యాచ్ గా అందుకున్నాడు. దీంతో మైకేల్ క్లింగర్ అవుటయ్యాడు. రెప్పపాటు కాలం జరిగిన ఈ అద్భుతమైన క్యాచ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా, ఈ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ ప్రకారం వెస్ట్రన్ ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో గెలుపొందింది. మ్యాక్స్ వెల్ పట్టిన ఆ క్యాచ్ ను మీరూ చూడండి.