: అర్ధరాత్రి తరువాత తెలంగాణ కొత్త జిల్లాలపై నోటిఫికేషన్


తెలంగాణ లో కొత్త జిల్లాల ఏర్పాటు లాంఛనాలన్నీ ముగిసినా ఒకే ఒక్క లాంఛనం మిగిలింది. ఆ ఒక్క లాంఛనాన్ని నేటి అర్ధరాత్రి అనంతరం ప్రభుత్వం పూర్తి చేయనుంది. తెలంగాణలో కొత్తగా 21 జిల్లాలు, 23 డివిజన్లు, 125 మండలాలు ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏ జిల్లాను ఎవరు ప్రారంభించాలన్న విషయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కొత్త జిల్లాల కలెక్టర్లు, డీజీపీలు, కమిషనర్లను కూడా నియమించింది. వీరు రేపు అనుకున్న ముహూర్తానికి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఈ మేరకు నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో నేటి అర్ధరాత్రిదాటిన తరువాత నోటిఫికేషన్ విడుదల కానుందని సమాచారం. దీంతో తెలంగాణలో మొత్తం 31 జిల్లాలు, 68 రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలు ఉండనున్నాయి.

  • Loading...

More Telugu News