: జమ్మూకాశ్మీర్ లో కొనసాగుతున్న భీకర ఎన్ కౌంటర్
జమ్మూకాశ్మీర్ లో భీకర ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఈడీఐ భవనంలోకి చొరబడ్డ ఉగ్రవాదులను ఏరివేసేందుకు సైన్యం యత్నిస్తోంది. సైనికులపైకి ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భారత భద్రతా దళాలు దీటుగా వ్యవహరిస్తున్నాయి. కాగా, భవనంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం.