: పాక్ నటులకు అవకాశమిచ్చారో మీ సంగతి చూస్తాం.. బాలీవుడ్ దర్శకులకు ఎంఎన్ఎస్ హెచ్చరిక
యూరీ సెక్టార్ లో ఉగ్ర దాడుల అనంతరం పాక్ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ ను మన దేశం విడిచి వెళ్లాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) హెచ్చరించడం విదితమే. తాజాగా, బాలీవుడ్ దర్శకులకు ఎంఎన్ఎస్ ఒక హెచ్చరిక జారీ చేసింది. పాక్ నటులకు అవకాశమిచ్చారో మీ సంగతి చూస్తామంటూ బాలీవుడ్ దర్శకులు మహేశ్ భట్, కరణ్ జొహార్ లను హెచ్చరించింది. భారతీయుల మనోభావాలతో ఆడుకోవద్దని, పాక్ కళాకారులకు వారి చిత్రాల్లో అవకాశమిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని పేర్కొంది. కాగా, కరణ్ జోహర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఏ దిల్ హై ముష్కిల్’, రాహుల్ ధొలాకియా దర్శకుడిగా రూపొందుతున్న ‘రాయీస్’ చిత్రాల్లో వరుసగా ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రాలను విడుదల కాకుండా అడ్డుకుంటామని ఎంఎన్ఎస్ ఈ సందర్భంగా హెచ్చరించింది.