: గురూజీ! తల పగులగొట్టేసేలా ఉన్నారు ఏం చేయమంటారు?: గురువును సంప్రదించిన అజింక్యా రహేనే


టీమిండియా కీలక ఆటగాడు అజింక్య రహానే తన టెస్టు బ్యాటింగ్ గురువు ప్రవీణ్ అమ్రేకు ఫోన్ చేసి ప్రత్యర్థుల వ్యూహం వివరించాడని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతనే పేర్కొన్నాడు. ప్రవీణ్ అమ్రే గతంలో టీమిండియా టెస్టు క్రికెటర్ గా ఆకట్టుకున్నాడు. ఇండోర్ లో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తొలి రోజు 70 పరుగులు చేసిన రహానే తలకు ఒక బౌన్సర్ తగిలింది. దీనితోపాటు రహానే ఛాతిని లక్ష్యం చేసుకుని బంతులు వేశారు. రహానేను అవుట్ చేసేందుకు కివీస్ బౌలర్లు రచించిన వ్యూహంలో భాగంగా బౌన్సర్లు సంధిస్తున్నారు. తన తల, ఛాతి లక్ష్యం చేసుకుని బంతులేస్తున్నారు. వాటిని ఎదుర్కోవడం ఎలా? అంటూ రహానే ఆయనకు ఫోన్ చేసి సలహా అడిగాడని ఆయన చెప్పారు. దానికి తాను మంచి బంతులను గౌరవించాలని, బౌన్సర్లను వదిలేయాలని ఆయన సూచించారు. క్రీజులో ఎంత ఎక్కువ సమయం ఉంటే అన్ని ఎక్కువ పరుగులు వస్తాయని ఆయన సలహా ఇచ్చారు. బౌన్సర్లకు టెంప్ట్ కావద్దని చెప్పడంతో రహానే...బౌన్సర్ల వ్యూహంతో బంతులేస్తున్న కివీస్ బౌలర్లపై తన వ్యూహం అమలు చేశాడని, దీంతో 188 పరుగులు సాధించి, అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మించాడని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News