: కేరళలో సీపీఎం కార్యకర్తపై మారణాయుధాలతో దాడి చేసిన దుండగులు.. కార్యకర్త మృతి
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఆ రాష్ట్ర అధికార పార్టీ సీపీఎం కార్యకర్త ఈ రోజు ఉదయం హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. మోహనన్ (52) అనే సీపీఎం కార్యకర్తపై కొందరు దుండగులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిది రాజకీయ హత్యగానే భావిస్తున్నారు. మోహనన్పై నలుగురు నుంచి ఐదుగురు దుండగులు ఈ దాడి చేసినట్లు తేల్చారు. రాజకీయంగా ఆ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు అధికంగానే జరుగుతున్నాయి.