: ఇడుపులపాయలో సంచుల కొద్దీ, బెంగళూరులో లారీల కొద్దీ డబ్బుమూటలు... 40 శాతం కేంద్రానికి ఇస్తున్న జగన్: దేవినేని సంచలన వ్యాఖ్యలు
వైకాపా అధినేత వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ, ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ విజయవాడలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇడుపులపాయలోని అండర్ గ్రౌండ్లలో ఉన్న బంకర్లలో సంచుల్లో వేల కోట్ల రూపాయలను ఆయన దాచుకున్నారని ఆరోపించారు. ఇక బెంగళూరులోని జగన్ నివాసం 'వైట్ హౌస్'లో లారీల కొద్దీ డబ్బు మూలుగుతోందని అన్నారు. భారీ నగదు డంప్ పై జగన్ కూర్చున్నాడని, అందులో 40 శాతం నల్లధనం వెల్లడి పథకం ద్వారా కేంద్రానికి వెళుతోందని అన్నారు. ఇదే సంపదను రాష్ట్రానికి ఇచ్చినట్లయితే, అభివృద్ధి పథంలో మరింత ముందుకు వెళ్లే వాళ్లమని, రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడేదని తెలిపారు. దేవినేని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.