: అశ్విన్ మ్యాజిక్...తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆధిక్యం 258


ఇండోర్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టు ఏకపక్షంగా మారిపోయింది. రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అశ్విన్, జడేజా స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న న్యూజిలాండ్ జట్టు బ్యాట్స్ మన్ విలవిల్లాడారు. 6 వికెట్లు తీసిన అశ్విన్, ఇద్దరు బ్యాట్స్ మన్ ను రనౌట్ చేసి కివీస్ పతనాన్ని శాసించాడు. అతనికి జడేజా అద్భుతమైన సహకారం అందించాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 258 పరుగులు వెనుకబడి తొలి ఇన్నింగ్స్ ముగించింది. భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు స్కోరు బోర్డుపై ఉంచి రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాలని టీమిండియా భావిస్తోంది. కోహ్లీ డబుల్ సెంచరీతో చెలరేగగా, అతనికి దీటుగా రహానే సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 557 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ జట్టులో గుప్తిల్ (72), లాంథమ్ (53), నీషమ్ (71) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు కేవలం 299 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో 258 పరుగుల ఆధిక్యంతో ఉన్న భారత జట్టు కాసేపట్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News