: సోయిలేకుండా ఫాంహౌస్‌లో నిద్రపోతోంది కేసీఆరే!: టీ కాంగ్రెస్ నేత భట్టీవిక్రమార్క


కాంగ్రెస్ నేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల టీపీసీసీ నేత మల్లు భట్టీవిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ భ‌వ‌న్‌లో టీపీసీసీ నేత‌లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, భ‌ట్టీవిక్ర‌మార్క‌, షబ్బీర్ అలీతో పాటు ప‌లువురు నేత‌లు తెలంగాణ‌లో రుణ‌మాఫీ, ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో భట్టీవిక్ర‌మార్క మాట్లాడుతూ... కాంగ్రెస్‌కు సోయి (స్పృహ) ఉంది కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. కేసీఆర్‌ సోయి లేకుండా ఫాంహౌస్‌లో నిద్ర‌పోతున్నార‌ని అన్నారు. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు ప‌త్తి మొత్తం త‌డిసిపోయి రైతులు క‌ష్టాల్లో ఉన్నార‌ని ఆయ‌న అన్నారు. రైతు రుణమాఫీ కాకపోవడంతో వారికి బ్యాంకులు రుణాలివ్వడం లేదని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News