: లోకేష్‌పై విమర్శలు చేసే అర్హత జగన్‌కు లేదు: మంత్రి దేవినేని ఉమ
టీడీపీ నిర్వహించిన శిక్షణ తరగతుల సందర్భంగా ఓ ఫొటోను ఆధారంగా తీసుకొని తమ పార్టీ యువనేత లోకేష్‌పై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు చేస్తోన్న విమర్శల పట్ల ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. లోకేష్‌పై విమర్శలు చేసే అర్హత జగన్‌కు లేదని ఆయన అన్నారు. అధికారం కోసం వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఇటువంటి విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. కాగా, ఏపీలో ఈ ఏడాది వర్షపాతం అధికంగా పడిందని ఆయన అన్నారు. నీటిని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు.