: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన న్యూజిలాండ్ ఓపెనర్లు.. వంద పరుగుల మార్కును దాటిన న్యూజిలాండ్ స్కోరు


న్యూజిలాండ్-భారత్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య ఇండోర్ వేదిక‌గా కొన‌సాగుతున్న మూడో టెస్టు మొద‌టి ఇన్సింగ్స్ లో న్యూజిలాండ్ వంద ప‌రుగుల మార్కును దాటింది. ఆ జ‌ట్టు ఓపెన‌ర్లు గుప్తిల్, లాథ‌మ్ లు క్రీజులో పాతుకుపోయారు. గుప్తిల్ హాఫ్ సెంచ‌రీ సాధించిన కొద్ది సేపటికే లాథ‌మ్ కూడా హాఫ్ సెంచ‌రీ చేశాడు. ప్ర‌స్తుతం క్రీజులో గుప్తిల్ 55 పరుగులతో లాథమ్ 51 పరుగులతో ఉన్నారు. న్యూజిలాండ్ కు ఎక్స్ ట్రాల రూపంలో 10 పరుగులు లభించాయి. దీంతో న్యూజిలాండ్ స్కోరు ప్రస్తుతం 116 పరుగులుగా (32 ఓవర్లకి) ఉంది. రన్ రేట్ 3.61(పేర్ ఓవర్)గా ఉంది. మైదానం బ్యాటింగ్ కు అనుకూలిస్తోంది.

  • Loading...

More Telugu News