: హైదరాబాద్లో ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లిన వ్యక్తిని చితకబాదిన పోలీసులు
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళితే ఓ వ్యక్తిని పోలీసులే చితక్కొట్టిన ఘటన హైదరాబాద్ మీర్పేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. తన భార్య కనిపించడం లేదని మీర్పేట్ ప్రాంతానికి చెందిన గోపి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. కేసు నమోదు చేసుకొని బాధితుడికి సాయం చేయాల్సిన పోలీసులు ఈ ఘటనకు పాల్పడ్డారు. పోలీసుల ప్రవర్తనపై బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి కారణం లేకుండానే గోపీపై పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు.