: బిల్ క్లింటన్ మాపై అత్యాచారం చేశాడు.. నలుగురు మహిళల ఆరోపణ


అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తమపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ నలుగురు మహిళలు ఆరోపించారు. రెండో డిబేట్‌లో హిల్లరీని ఎదుర్కొనేందుకు ముందు ట్రంప్.. క్లింటన్‌పై లైంగిక ఆరోపణలు చేస్తున్న మహిళలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం గమనార్హం. బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తమపై అత్యాచారానికి పాల్పడ్డారని ఈ సందర్భంగా ముగ్గురు మహిళలు ఆరోపించారు. మరో మహిళ మాత్రం తాను బాలికగా ఉన్నప్పుడు క్లింటన్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో మహిళలపై తాను చేసిన అశ్లీల వ్యాఖ్యల టేపులు బయటపడడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ట్రంప్.. హిల్లరీని ఎదుర్కొనేందుకు బాధిత మహిళలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. బాధిత మహిళలు చాలా ధైర్యవంతులని, వారికి అండగా నిలబడడం గౌరవంగా భావించే ఈ సమావేశాన్ని నిర్వహించినట్టు ట్రంప్ పేర్కొన్నారు. కాగా కొద్దిసేపటి క్రితం సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో జరిగిన డిబేట్‌లో ట్రంప్, హిల్లరీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

  • Loading...

More Telugu News