: కరుడుగట్టిన పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ హతం.. శ్రీలంక క్రికెటర్లపై దాడిలో సూత్రధారి


2009లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడికి సూత్రధారి, కరుడుగట్టిన పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్‌ హతమయ్యాడు. పాకిస్థాన్‌లో జరిగిన అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించిన అజ్మల్‌ను ఆఫ్గనిస్థాన్- అమెరికా ప్రత్యేక బలగాలు మట్టుబెట్టాయి. నిషేధిత లష్కరే-ఇ- జంగీ ఉగ్రవాద సంస్థలో అగ్రనేతగా ఉన్న అజ్మల్‌కు తెహ్రీక్-ఇ-తాలిబన్(పాకిస్థాన్)తోనూ బలమైన సంబంధాలు ఉన్నాయి. పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ సరిహద్దులోని పాక్ టిక్కాలో గత కొంతకాలంగా తలదాచుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పాక్ టిక్కాలోని తాలిబన్ స్థావరాలపై ఆఫ్గనిస్థాన్-అమెరికా బలగాలు చేసిన దాడుల్లో అజ్మల్ మృతి చెందగా మరికొందరు ఉగ్రవాదులను సజీవంగా పట్టుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.

  • Loading...

More Telugu News