: పది, పాతిక, కోటి రూపాయలు ఎంత ఇచ్చినా తీసుకుంటా.. నో డిమాండ్ : కోన వెంకట్
'పది, పాతిక, కోటి రూపాయలు ఎంతిచ్చినా తీసుకుంటాను, నిర్మాతను డిమాండ్ మాత్రం చేయను' అంటున్నారు మాటల రచయిత కోన వెంకట్. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "పిండి కొద్దీ రొట్టె. ఏ ఫిల్మ్ కు ఎంత బడ్జెట్ ఉంటుందనే విషయం నాకు తెలుసు. ప్రొడ్యూసర్ ని పిండి వాళ్ల దగ్గర నుంచి వసూలు చేయను. మీరు ఎంత ఇవ్వగలుగుతామనుకుంటే అంతే ఇవ్వండని చెబుతాను. చిత్రం మార్కెట్ ను బట్టే వాళ్లు కూడా ఇవ్వగల్గుతారు. మీరు ఇంత ఇస్తేనే చేస్తా, లేకపోతే లేదు అని ఈరోజు వరకు.. ఐ నెవర్ డిమాండ్" అని కోన వెంకట్ అన్నారు.