: శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు...ఐదుగురి దుర్మరణం


తమిళనాడులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. విల్లుపురం జిల్లా శివకాశిలోని పులిచపాల్యం సమీపంలోని బాణ సంచా తయారీ కేంద్రంలో ఈ రోజు సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ఈ ప్రమాద సంఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News