: వైఎస్ రాజారెడ్డి వల్లే మేము గన్ లైసెన్స్ తీసుకున్నాం: జేసీ ప్రభాకర్ రెడ్డి


‘వైఎస్ రాజారెడ్డి వల్లే ఫ్యాక్షన్.. దానిని మేము ప్రతిఘటించేవాళ్లం.. మేము ఎటువంటి మర్డర్లు చేయలేదు.. చేయించలేదు.. మా మీద కేసులు కూడా లేవు’ అని టీడీపీ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాజారెడ్డి ఫ్యాక్షన్ కు పాల్పడితే తాము ప్రతిఘటించేవాళ్లమని, ఆయన కారణంగానే తాము గన్ లైసెన్స్ తీసుకున్నామని అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా తాము మొదటి నుంచి పనిచేసేవాళ్లమని అన్నారు. తమ మూలాలు తెలంగాణ లో ఉన్నాయని, గద్వాల్ తమ స్వస్థలమని, గతంలో తమ తాతల కాలంలో తాడిపత్రికి వచ్చేశామని అన్నారు. తాడిపత్రిలో ఒకప్పుడు తానంటే భయపడేవారని, అయితే, అభివృద్ధి కోసం ప్రజలందరూ తనతో సహకరిస్తున్నారని ప్రభాకర్ రెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News