: ఇప్పటికే కాదు ఎప్పటికీ నా తీరని కోరిక అది: హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి


‘బాపు గారి దర్శకత్వంలో నటించాలనేది ఇప్పటికే కాదు ఎప్పటికీ నాకు తీరని కోరికగా మిగిలిపోయింది’ అని ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘బాపుగారి దర్శకత్వంలో నటించాలని నేను చాలా ట్రై చేశాను గానీ, నా వల్ల కాలేదు. ఆయన దగ్గర పనిచేయలేకపోయాననే ఆ బాధ అలాగే ఉండిపోయింది’ అని శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. తనకు సినిమా అవకాశాలు లేకుండా ఉన్న రోజులు లేవని, మహా అయితే, ఇప్పటివరకు ఒక రెండు నెలలు గ్యాప్ తీసుకున్న సందర్భాలున్నాయన్నాడు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని అన్నాడు.

  • Loading...

More Telugu News