: నా సినిమాలకు రివ్యూ లు ఆశాజనకంగా రావు: నటుడు సునీల్


‘గత ఐదారేళ్లుగా చూస్తున్నాను.. నా సినిమాలకు రివ్యూలు ఆశాజనకంగా రావు’ అని ప్రముఖ నటుడు సునీల్ అన్నాడు. ఒక న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ, ‘నా సినిమాలకు రివ్యూలు బాగా రాకపోయినా, కలెక్షన్లు మాత్రం బాగా వస్తున్నాయి. నేను బాగా కష్టపడి పైకొస్తున్నానని చెప్పి, అభిమానులకు, ప్రేక్షకులకు నేనంటే అభిమానం బాగా ఎక్కువైపోయింది. అందుకే, నా చిత్రాలకు రెవెన్యూ బాగా వస్తోంది’ అని సునీల్ చెప్పాడు. అయితే, చిత్రం రివ్యూ కన్నా రెవెన్యూ ముఖ్యమా? అనే ప్రశ్నకు సునీల్ సమాధానమిస్తూ, ‘ఆడియన్సే బెటర్ రివ్యూవర్, స్టోరీ యే సూపర్ స్టార్. ప్రేక్షకులను నవ్వించడం కోసమే కొన్నేళ్లుగా నేను నటిస్తున్నాను.. అదే పద్ధతి కొనసాగిస్తాను’ అని సునీల్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News