: ఢిల్లీ విమానాశ్రయంలో అణుధార్మికత... టీ-3 కార్గో మూత!
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టర్మినల్ -3 కార్గో ప్రాంతంలో రేడియో ధార్మిక పదార్థం లీక్ అయినట్టు గమనించిన అధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆ ప్రాంతాన్నంతా ఖాళీ చేయించి, నాలుగు ఫైర్ ఇంజన్లను ఆ ప్రాంతంలో మోహరించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్, డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అధికారులు ఎయిర్ పోర్టుకు బయలుదేరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కార్గో టర్మినల్ మొత్తాన్ని ఖాళీ చేయించామని, పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.