: లోకేష్ ను చూసి వైకాపా వణికిపోతోంది!: సోమిరెడ్డి
తెలుగుదేశం పార్టీలో రోజురోజుకూ ఎదుగుతున్న యువనేత లోకేష్ ను చూసి వైకాపాకు భయం పట్టుకుందని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాలో మాట్లాడిన ఆయన, పాలనలో లోకేష్ భాగస్వామ్యం కావాలన్నది ప్రజల ఆకాంక్షని తెలిపారు. పీకల్లోతు అవినీతిలో మునిగిపోయి, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైకాపా అధినేతకు తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు లేదని అన్నారు. తెలుగుదేశం జాతీయ కార్యదర్శి హోదాలో లోకేష్, నాయకత్వ సదస్సుకు హాజరయ్యారని స్పష్టం చేశారు. ఆ హోదాతోనే ప్రసంగించారని అన్నారు.