: జయలలిత హెల్త్ అప్ డేట్... అన్నీ పాజిటివ్ రిపోర్టులేనన్న సీఆర్ సరస్వతి


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో వేగంగా కోలుకుంటున్నారని ఏఐఏడీఎంకే నేత సీఆర్ సరస్వతి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆసుపత్రి వైద్యుల నుంచి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని తెలిపారు. "గవర్నర్ ఆమెను సందర్శించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చి వెళ్లారు. ప్రతి ఒక్కరూ సీఎం కోలుకుంటున్నారనే చెప్పారు. డాక్టర్లు అనునిత్యం ఆమెను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అందరు నేతలూ ఒకే మాట చెబుతున్నారుగా? ఇక బాధ పడాల్సిన అవసరం లేదు. ఆమె కోలుకుంటున్నారు" అని చెప్పారు. తాజా హెల్త్ బులెటిన్ లో ఆమెకు వైద్యం జరుగుతోందని, ప్రత్యేక వైద్య బృందం ఆమెకు చికిత్స చేస్తోందని వెల్లడించింది. కాగా, సెప్టెంబర్ 22న ఆమె జ్వరం, డీ హైడ్రేషన్ సమస్యలతో అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News