: కాపులకు మీరేం చేశారో చెప్పండి?: చిరంజీవి, బొత్స, దాసరిలకు చినరాజప్ప సూటిప్రశ్న
కాపు సామాజిక నేతలుగా చెప్పుకుని ప్రచారం పొందుతున్న చిరంజీవి, బొత్స సత్యనారాయణ, దాసరి నారాయణరావులు కాపులకు ఏమీ చేయలేదని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. వారు ఏమైనా చేసుంటే అదేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని, కాపు కమిషన్ పర్యటనలు జరుగుతున్న వేళ, కొందరు విపక్ష కాపు నేతలు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని, వారిది కేవలం స్వార్థం మాత్రమేనని నిప్పులు చెరిగారు. కనీసం కమిటీ నివేదిక వచ్చే వరకూ వేచి చూడని వారి నైజం వెనకున్న రాజకీయ ప్రయోజనాల కోణం కాపులకు తెలుసునని అన్నారు.