: రూ. 5 వేల కోట్లు తగ్గిపోయిన ట్రంప్ సంపద... ఫోర్బ్స్ జాబితాలో 35 స్థానాలు డౌన్
అమెరికాలోని ధనవంతుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేయగా, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ర్యాంకు గత సంవత్సరంతో పోలిస్తే 35 స్థానాలు దిగజారింది. గత అక్టోబర్ లో 121వ స్థానంలో ఉన్న ఆయన, ఈ సంవత్సరం 156వ స్థానానికి జారిపోయారు. ఆయన సంపద రూ. 29,969 కోట్ల నుంచి రూ. 5,328 కోట్లు తగ్గి రూ. 24,641 కోట్లకు చేరిందని ఫోర్బ్స్ వెల్లడించింది. ట్రంప్ పెట్టుబడులు పెట్టిన వివిధ కంపెనీల ఈక్విటీ విలువ తగ్గడం, ఆయన సంస్థల్లో వచ్చిన నష్టాల కారణంగా ట్రంప్ ర్యాంక్ పతనమైందని ఫోర్బ్స్ పేర్కొంది.