: గోబెల్స్ ప్రచారాన్ని ఆపాల్సిన బాధ్యత మాపై ఉంది... నేను ఎవరితోనూ మాట అనిపించుకోను: ఏపీ డిప్యూటీ సీఏం చినరాజప్ప


నారా లోకేష్ తనను ఏమీ అనలేదని ఏపీ డిప్యూటీ సీఏం, హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, తాను ఇంత వరకు ఎవరితోనూ మాట అనిపించుకునేలా బతకలేదని అన్నారు. తప్పు చేస్తే ఎవరైనా ఏదైనా అంటారని ఆయన తెలిపారు. తానెప్పుడూ తప్పు చేయలేదని, ఇతరులతో చెప్పించుకోవాల్సిన అవసరం తనకు లేదని ఆయన చెప్పారు. నారా లోకేష్ తనను ఏదో అన్నారంటూ కొంత మంది గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి గోబెల్స్ ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన చెప్పారు. ఈ గోబెల్స్ ప్రచారానికి పాల్పడ్డవారిని పట్టుకుని శిక్షిస్తామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News