: ఎల్బీ స్టేడియంలో 9,292 మందితో 'మహాబతుకమ్మ' వేడుక.. సొంతమైన గిన్నిస్ రికార్డ్


తెలంగాణ సంస్కృతిని ప్ర‌తిబింబింప‌జేసే బ‌తుక‌మ్మ పండుగ‌లో భాగంగా ఈరోజు హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన మ‌హాబ‌తుక‌మ్మ వేడుక‌లు ఘ‌నంగా కొన‌సాగుతున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధ మ‌హిళ‌ల వ‌ర‌కు ఎల్బీస్టేడియానికి భారీ సంఖ్య‌లో చేరుకున్నారు. ఉత్సాహంగా ఆడిపాడుతున్నారు. మొత్తం 9,292 మంది ఒకేసారి బ‌తుక‌మ్మ ఆడి గిన్నిస్‌ రికార్డు న‌మోదు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. మైదానంలో మొత్తం 35 వ‌ర‌స‌ల్లో బ‌తుక‌మ్మ ఆడారు. ఈ వేడుక‌ల‌ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వద్ద పెద్ద ఎత్తున‌ పోలీసులను మోహ‌రింప‌జేశారు. మొత్తం 27 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే రికార్డుకు సంబంధించిన సర్టిపికెట్ ను అందజేస్తారు.

  • Loading...

More Telugu News