: రాహుల్ గాంధీపై మరో కేసు నమోదు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై మరో కేసు నమోదు నమోదయింది. ఇటీవల పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం లక్షిత దాడులు చేసి ఉగ్రవాదులను హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే, కిసాన్ యాత్రలో భాగంగా ఆ దాడులపై రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేశారు. ఆ దాడులపై రాహుల్ మాట్లాడుతూ సర్జికల్ స్ట్రయిక్స్ కు మద్దతు తెలుపుతున్నానంటూనే ప్రధాని నరేంద్ర మోదీ ఆ దాడులను ఉపయోగించుకుంటూ రాజకీయం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ఉత్తరప్రదేశ్‌లోని చందోలిలో రాహుల్‌గాంధీపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.