: 'వైజాగ్ స్టీల్'కి బ్రాండ్ అంబాసడర్ గా సింధు


ప్రఖ్యాతిగాంచిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు బ్రాండ్ అంబాసడర్ గా నియమితురాలైంది. దీనిలో భాగంగా జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో సింధు ధరించే జెర్సీపై వైజాగ్ స్టీల్ లోగో ఉంటుంది. ఒలింపిక్స్ పతకం గెలిచిన తర్వాత సింధుకు అనేక వాణిజ్య ఒప్పందాలు వచ్చాయి. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ, తాను ఒప్పందం చేసుకున్న పెద్ద బ్రాండ్లలో ఇది కూడా ఒకటని తెలిపింది. ఆట గురించి చెబుతూ... ప్రతి నెలా మూడు ప్రధాన టోర్నీలు జరిగేలా బ్యాడ్మింటన్ క్యాలెండర్ ను మార్చారని... దీని కారణంగా సరైన టోర్నీని సెలెక్ట్ చేసుకుంటేనే ర్యాంకింగ్ మెరుగుపడుతుందని చెప్పింది.

  • Loading...

More Telugu News