: బతుకమ్మ ఆటపాటలతో నిరసన తెలిపిన వీహెచ్
హైదరాబాదులోని అంబర్ పేటలోని బతుకమ్మ కుంటను ఆదుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) వినూత్న నిరసన తెలిపారు. బతుకమ్మకుంట దురాక్రమణలకు గురయిందని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా కాలుష్య కాసారంగా మారిన బతుకమ్మకుంటను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిమీదా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఆయన తన నిరసన తెలిపారు.