: 200 మార్కు దాటిన టీమిండియా స్కోరు.. హాఫ్ సెంచరీ బాదిన రహానే.. అదరగొడుతున్న కోహ్లీ
న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ భారత్ పర్యటనలో భాగంగా ఇండోర్ వేదికగా కొనసాగుతున్న మూడో టెస్టు మ్యాచులో టీమిండియా బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రహానే క్రీజులో నిలదొక్కుకొని రాణిస్తున్నారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ మురళీ విజయ్ (10), గౌతమ్ గంభీర్ (29), పుజారా(41) స్వల్ప స్కోరుకే వెనుదిరిగిన విషయం తెలిసిందే. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ, రహానే ఒకరికొకరు చక్కని సహకారం అందించుకుంటూ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హాఫ్ సెంచరీ దాటేసిన కోహ్లీ 82 పరుగులతో క్రీజులో ఉండగా, రహానే కూడా హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో టీమిండియా స్కోర్ 200 పరుగుల మార్కును దాటింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 216/3 (77 ఓవర్లకి).