: చురుగ్గా ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన!
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ బెంగాల్, ఒడిశాలపై చురుగ్గా కొనసాగుతోందని చెప్పారు. వీటి ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల చెదురుమదురుగా, పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.