: పుజారా ఔట్... టీమిండియా 110/3
న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా 100 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 108 బంతులను ఎదుర్కొన్న పుజారా 6 ఫోర్ల సాయంతో 41 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం, 26 పరుగులతో క్రీజులో ఉన్న కోహ్లీకి రహానే జతకలిశాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 3 వికెట్ల నష్టానికి 110 పరుగులు. బౌల్ట్, పటేల్, శాంట్నర్ లు చెరో వికెట్ తీశారు.