: నా ఫేవరేట్ యాంకర్ నేనే.. నేను విశాఖ అమ్మాయిని: జబర్దస్త్ భామ రష్మీ
సినీ నటి, పాప్యులర్ తెలుగు కామెడీషో ‘జబర్దస్త్’ యాంకర్ రష్మి నటించిన తాజా చిత్రం ‘తను వచ్చెనంట’ పబ్లిసిటీలో భాగంగా ఆమె తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో మీడియాతో మాట్లాడింది. తన జీవిత కాలం మొత్తం తెరపై కనిపిస్తూనే ఉంటానని చెప్పింది. ప్రేక్షకులను అలరించాలన్నదే తన గోల్ అని పేర్కొంది. తన వద్దకు వచ్చే సినీ, టీవీ అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటానని చెప్పింది. టీవీల్లో యాంకరింగ్ చేయడం తనకెంతో గుర్తింపు తెచ్చిందని ఈ భామ చెప్పింది. ‘తను వచ్చెనంట’ సినిమా ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుందని ఆమె పేర్కొంది. అలాగే తాను చేయనున్న తదుపరి చిత్రం గురించి వెల్లడించింది. ప్రముఖ గాయకురాలు గీతామాధురి భర్త నందు ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రభాకర్ రూపొందించనున్న ఓ కొత్త సినిమాలో తాను నటించనున్నట్లు తెలిపింది. ‘తను వచ్చెనంట’ సినిమాలో తాను జాంబి పాత్రలో కనపడనున్నట్లు పేర్కొంది. ఈ సినిమాలో అద్భుతమైన హాస్యం ఉంటుందని చెప్పింది. తన ఫేవరేట్ యాంకర్ తానేనని ఈ భామ నవ్వుతూ చెప్పింది. తన ఫేవరేట్ నటి మాధురీ దీక్షిత్ అని రష్మీ చెప్పింది. కాగా, తాను విశాఖపట్నానికి చెందిన అమ్మాయినని పేర్కొంది. తన తండ్రి ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడని, అక్కడ వ్యాపారం చేస్తున్నారని చెప్పింది. ఒక తన తల్లి ఒడిశా రాష్ట్రానికి చెందినదిగా చెప్పింది. అయితే తన తల్లి సబిత విశాఖలో ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహించి రిటైర్ అయ్యారని ఆమె చెప్పింది.