: శంషాబాద్ విమానాశ్రయంలో జాంబియా నుంచి వచ్చిన మహిళ అరెస్ట్


హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయంలో ఈరోజు ఉదయం జాంబియా నుంచి విమానంలో వచ్చిన ఓ మ‌హిళ‌ను అక్క‌డి సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్ - అవుట్ నోటీసులు జారీ చేయ‌డంతో ఎయిర్‌పోర్టులో ఆమె కాలుపెట్ట‌గానే అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆమె విమానాశ్ర‌య పోలీసుల అధీనంలో ఉంది. స‌ద‌రు మహిళ గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్య‌క్తిగా తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News