: బేగంపేటలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. లోపల అద్వానీ!
బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ ప్రయాణిస్తోన్న ఓ విమానంలో నేడు ఇంధనం సమస్య తలెత్తింది. దీంతో, విమానాన్ని అత్యవసరంగా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో కిందకు దింపారు. ఈ విమానం బెంగళూరు వెళుతోండగా ఈ విషయాన్ని గుర్తించారు. కాగా, అద్వానీ ప్రయాణిస్తున్న విమానం హైదరాబాద్ లో దిగిందన్న విషయం తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు బేగంపేట విమానాశ్రయంలో ఆయనతో సమావేశమయ్యారు.