: యూపీ ఘజియాబాద్‌లో ఘనంగా వైమానిక దళ దినోత్సవం...వాయుసేన అద్భుత విన్యాసాలు.. హాజరైన సచిన్
నేడు భారతీయ వాయుసేన 84వ వార్షిక దినోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా యూపీ ఘజియాబాద్‌లోని హిండోస్ ఎయిర్‌బేస్‌లో వైమానిక దళ దినోత్సవం జరుపుతున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్, టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ లు కూడా హాజరయ్యారు. మరోవైపు భారీ ఎత్తున ప్రజలు వచ్చారు. వాయుసేనలోని పలు బృందాలు ప్రదర్శిస్తోన్న అద్భుత విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వాయుసేన దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానిమోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. వాయుసేనకు సెల్యూట్ అని పేర్కొన్నారు. ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించే వాయుసేన మనదేశానికే గర్వకారణమని అన్నారు. రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పందిస్తూ... మనదేశానికి మరింత బలం చేకూర్చే క్రమంలో ఎయిర్‌ఫోర్స్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.