: మొదలైన దసరా రద్దీ.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
నగరంలో దసరా రద్దీ మొదలైంది. ఊర్లకు తరలివెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు రైళ్లన్నీ కిక్కిరిసిపోయి ప్రయాణిస్తున్నాయి. గంటల తరబడి బస్సులు లేకపోవడంతో జూబ్లీ బస్టాండ్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. వెంటనే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇదే అదునుగా రంగంలోకి దిగిన ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికుల జేబులను గుల్ల చేస్తున్నాయి. రెట్టింపు ధరలు వసూలు చేస్తూ దసరా రద్దీని సొమ్ము చేసుకుంటున్నాయి. క్షణక్షణానికి రద్దీ పెరుగుతుండడంతో ఇప్పటి నుంచే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.