: మంచు లక్ష్మి నాటకమేస్తుంటే చూసి నా కళ్ల వెంబడి నీళ్లొచ్చేశాయ్: దాసరి


మంచు లక్ష్మీ హాలీవుడ్ లో నటించిన విషయం చాలామందికి తెలియదని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. ‘లక్ష్మీబాంబు’ ఆడియో వేడుకలో మాట్లాడుతూ,‘గతంలో హైదారాబాద్ లో లక్ష్మి ఒక నాటకంలో నటిస్తుంటే మోహన్ బాబు, నేను చూసేందుకు వెళ్లాము. లక్ష్మి నటన చూసి నాకు కళ్ల వెంబడి నీళ్లొచ్చేశాయి. మా ముందు చిన్నపిల్లగా తిరిగిన లక్ష్మి, స్టేజ్ పై ఎంతో గొప్పగా నటిస్తుంటే చాలా ఆనందపడ్డాను. లక్ష్మితో రాములమ్మ వంటి సినిమా ఒకటి తీయాలనుకుని గతంలో అనుకున్నాను. కానీ, లక్ష్మి నటనపై అంత ఎక్కువగా దృష్టి పెట్టలేదు’ అని దాసరి నవ్వుతూ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News