: పాకిస్తాన్ నటులతో పనిచేసేంత గొప్ప మనసు నాకు లేదు: అజయ్ దేవగణ్
బాలీవుడ్ లో దేశభక్తి ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించిన అజయ్ దేవగణ్ పాక్ నటులతో పనిచేయలేనని తెలిపాడు. ఓ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ నటులతో కలిసి పని చేయలేనని చెప్పాడు. మనం శాంతిని కోరుకుంటున్నామని అన్నాడు. అదే సమయంలో ఒక్కచేతితో చప్పట్లు కొట్టలేమన్న వాస్తవాన్ని గుర్తించాలని ఆయన సూచించాడు. కొంత మంది మాటల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కామవుతాయని పేర్కొంటున్నారని, అది సరికాదని, మనం మాట్లాడుతుంటే అవతలి వాళ్లు చంపడానికొస్తున్నారని గుర్తుచేశాడు. ఉదాహరణకి.. మీతో ప్రయాణం చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తి హఠాత్తుగా మిమ్మల్ని చాచి ఒక లెంపకాయ కొట్టాడనుకోండి! అప్పుడు కూడా మీరు మాటలతోనే అతనికి సమాధానం చెప్పలేరుగా? మీ శైలిలో మీరూ స్పందిస్తారుగా? అన్నాడు. ఆ సమయంలో అలా ప్రతిస్పందించడమే కరెక్ట్ అని అజయ్ దేవగణ్ తెలిపాడు.