: గవర్నర్ తో సాధారణ సమావేశమే...ఎలాంటి ప్రత్యేకతా లేదు: తమిళనాడు రాజ్ భవన్
తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావుతో ఆ రాష్ట్ర సీనియర్ మంత్రులు పన్నీర్ సెల్వం, పళనిస్వామిల సమావేశం వివరాలను రాజ్ భవన్ తెలియజేసింది. మంత్రులతో ఇన్ ఛార్జ్ గవర్నర్ సమావేశానికి ఎలాంటి ప్రత్యేకతా లేదని, సాధారణ సమావేశమేనని రాజ్ భవన్ తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితితో పాటు సాధారణ పరిపాలన, కావేరీ నదీజలాల అంశాలపైన చర్చ జరిగినట్టు రాజ్ భవన్ ప్రకటన జారీ చేసింది. కాగా, తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం, పళనిస్వామిలను ప్రకటించనున్నారన్న వార్తల నడుమ ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.