: తమిళనాడు డిప్యూటీ సీఎంగా పళని స్వామి?


తమిళనాడులో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పళని స్వామి నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపాలనా వ్యవహారాలు స్తంభించకుండా ఉండాలనే ఉద్దేశంతో పళని స్వామిని డిప్యూటీ సీఎం గా నియమిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అన్నాడీఎంకేలోని సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరైన పళనిస్వామి సేలం జిల్లా నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా, రాజ్ భవన్ లో రాష్ట్ర ఇన్ ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నాడీఎంకే మంత్రులు పళనిస్వామి, పన్నీరు సెల్వంతో భేటీ అయిన విషయం విదితమే. ఇదిలా ఉండగా, తమిళనాడులో గవర్నర్ పాలన విధించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News