: తమిళనాడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం?


తీవ్ర అనారోగ్యం కారణంగా తమిళనాడు సీఎం జయలలిత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాలనా వ్యవహారాలు చూసుకునేందుకుగాను తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించేందుకు రాజ్ భవన్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇన్ ఛార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అక్కడి సీనియర్ మంత్రులు పన్నీర్ సెల్వం, పళనిస్వామిలతో చర్చించారు. జయలలితకు నమ్మినబంటు, విశ్వాసపాత్రుడు అయిన పన్నీర్ సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News