: సుష్మాజీ! సాయం చేయండి... మాకు పాక్ కోడలు కావాలి!: రాజస్థానీ విన్నపం


పాకిస్తానీ యువతిని కోడలిగా తెచ్చుకుందామన్న ప్రయత్నంలో తనకు ఎదురైన ఇబ్బందిని రాజస్థాన్ కు చెందిన కన్నయ్యలాల్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు వివరించి, పరిష్కరించాలని కోరాడు. భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్ యువతిని కోడలిగా చేసుకోవడం అనే ఈ కథలోకి వెళ్తే... 2001లో రాజస్థాన్ లోని జోధ్ పూర్ కి చెందిన కన్నయ్యలాల్ తొలిసారిగా పాకిస్థాన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి సంస్కృతి, సంప్రదాయాలపై ముచ్చటపడ్డ ఆయన, తనకు కోడలయ్యే అర్హత పాకిస్థాన్ యువతికే ఉందని నిర్ణయానికి వచ్చారు. ఆయన అనుకున్నట్టే తన కుమారుడు నరేష్ తెవానీకి కరాచీకి చెందిన ప్రియ అనే యువతితో నిశ్చితార్థం చేశారు. నవంబర్ లో వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో యూరీ ఘటన, సర్జికల్ స్ట్రయిక్స్ చోటుచేసుకోవడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నరేష్ పాస్ పోర్ట్, వీసాకి దరఖాస్తు చేసుకోగా ఆయనకు రెండూ లభించాయి. అయితే అతనికి కాబోయే భార్య ప్రియకి మాత్రం పాస్ పోర్ట్, వీసా మంజూరులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో కేంద్ర మంత్రి జోక్యం చేసుకుని పాకిస్థానీ కోడలిని తమ కుటుంబంలో చేర్చుకునేందుకు సాయం చేయాలని కన్నయ్యలాల్ కోరారు.

  • Loading...

More Telugu News