: లోకేశ్ నన్నేమీ అనలేదు..అదంతా వైఎస్సార్సీపీ దుష్ప్రచారం: ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప
‘లోకేశ్ నన్నేమీ అనలేదు.. లోకేశ్, నన్ను ఏదో అన్నట్లుగా వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోంది’ అని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని, సీఎం చంద్రబాబుపై దుష్ప్రచారం చేసేందుకే బొత్స సత్యనారాయణతో జగన్ కమిటీ వేశారని విమర్శించారు. జగన్ ఎదుట బొత్స లాంటివారు పిల్లిలా వ్యవహరిస్తారని, బొత్సలా తనపై ఎటువంటి స్కామ్ లు లేవని, తానెవరికీ భయపడనని ఈ సందర్భంగా చినరాజప్ప పేర్కొన్నారు.